ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా సినీ నటుడు చిరంజీవి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ఆయన చేసిన సందేశంలో మోదీ నాయకత్వం, సేవా దృక్పథాన్ని ప్రశంసించారు. మోదీ జీవన ప్రయాణం పట్టుదల, క్రమశిక్షణ, దేశసేవ పట్ల అచంచలమైన నిబద్ధతకు ప్రతీకగా నిలిచిందని చిరంజీవి పేర్కొన్నారు. బలమైన, స్వావలంబన భారత్ నిర్మాణం కోసం ఆయన చూపిస్తున్న దూరదృష్టి, సేవా భావం లక్షలాది మందికి స్ఫూర్తినిస్తోందని అన్నారు.
ప్రధాని మోదీకి చిరంజీవి జన్మదిన శుభాకాంక్షలు.. సేవా స్ఫూర్తిని కొనియాడిన మెగాస్టార్
0
Share.