పెట్టుబడిదారులకు లిటిల్‌ సీజర్స్‌ న్యూ బిజినెస్ ప్రపోజల్

0

ముంబై ;ప్రపంచంలో మూడవ అతిపెద్దపిజ్జా గొలుసుకట్టు సంస్థ లిటిల్‌ సీజర్స్‌ పిజ్జా ఇప్పుడు భారతదేశంలో  తమ ఫ్రాంచైజీల సహాయంతో మెరుగైన శుభ్రత, భద్రత, కాంటాక్ట్‌లెస్‌ అనుభవాలను అందించడంతో పాటుగా భారతదేశంలో ఎక్కడైనా సరే అత్యంత అందుబాటు ధరలలో భోజనాలను కోరుకునే వినియోగదారులకు సేవలను అందించడానికి సిద్ధమైంది. అంతర్జాతీయంగా సుప్రసిద్ధమైన ఈ బ్రాండ్‌ ప్రస్తుతం26 దేశాలలో తమ కార్యకలాపాలను నిర్వహిస్తుంది. మహమ్మారి వేళ నూతన మదుపరులకు సిల్వర్‌ లైనింగ్‌ అందించే పరిష్కార ఆధారిత విధానంతో ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా తమ పాదముద్రికలను విస్తరించాలని ప్రణాళిక చేసింది.

భద్రత , శుభ్రత పరంగా అత్యున్నత ప్రమాణాలను అనుసరించడం ద్వారా ఈ బ్రాండ్‌ చిపరిచితం. ఇప్పుడు తమ హాట్‌–ఎన్‌–రెడ్‌ నమూనాను వినియోగదారులకు పరిచయం చేసేందుకు ఆసక్తిగా ఉంది. ఇది వినియోగదారులకు 30 సెకన్లు లేదా అంతకన్నా తక్కువ సమయం మాత్రమే స్టోర్‌ లోపల , బయట ఉండేలా అనుమతిస్తుంది. తద్వారా మహామ్మారి వేళ వినియోగదారులకు సురక్షితంగా ఉంటూనే సౌకర్యవంతమైన అనుభవాలనూ అందిస్తుంది. అంతర్జాతీయ క్యుఎస్‌ఆర్‌ సంస్ధ తమ పిజ్జాలన్నీ కూడా ఓవెన్‌లో బేక్‌ చేస్తాయని, 254 డిగ్రీల సెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్రతను ఇవి చేరుకుంటాయనే భరోసా అందిస్తుంది. అంతేకాదు, ఓవెన్‌ నుంచి పిజ్జా బయటకు వచ్చిన తరువాత నేరుగా బాక్స్‌లోనే చేరుతుందనే భరోసానూ అందిస్తుంది. తద్వారా కోవిడ్‌–19 మహమ్మారి వేళ వినియోగదారులకు భరోసానూ అందిస్తుంది.

Share.

Leave A Reply