IND vs SL : చాలా ఏళ్ల తర్వాత టీమిండియా రెండు జట్లుగా విడిపోయి అంతర్జాతీయ క్రికెట్ ఆడనుంది. కాగా చాలా ఏళ్ళ తర్వాత భారత్ రెండు జట్లుగా విడిపోయి అంతర్జాతీయ క్రికెట్ ఆడనుంది.ఒక జట్టు విరాట్ కోహ్లీ సారధ్యంలో డబ్ల్యూటీసీ ఫైనల్, ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్ ఆడనుండగా.. లిమిటెడ్ ఓవర్ల స్పెషలిస్టులతో కూడిన జట్టు లంక పర్యటనకు వెళ్లనుంది
భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. సీనియర్ ఆటగాళ్లు ఇంగ్లాండ్ టూర్‌లో ఉన్న నేపథ్యంలో వన్డే, టీ20కి శిఖర్ ధావన్‌కి కెప్టెన్ పగ్గాలు అప్పగించారు. భువనేశ్వర్ కుమార్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. యువకులతో కూడిన జట్టు త్వరలోనే శ్రీలంకకు పయనమవనుంది. జులైలో శ్రీలంకతో భారత్ తలపడనుంది. జూలై 13 నుంచి 25 మధ్య ఇరు జట్లు ఇరు జట్లు మూడు వన్డేలు, మూడు టీ20లను ఆడనున్నాయి. ఈ మ్యాచ్‌లు జరిగే వేదికలను బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు. ఇదిలా ఉంటే చాలా ఏళ్ల తర్వాత టీమిండియా రెండు జట్లుగా విడిపోయి అంతర్జాతీయ క్రికెట్ ఆడనుంది. కాగా చాలా ఏళ్ళ తర్వాత భారత్ రెండు జట్లుగా విడిపోయి అంతర్జాతీయ క్రికెట్ ఆడనుంది.ఒక జట్టు విరాట్ కోహ్లీ సారధ్యంలో డబ్ల్యూటీసీ ఫైనల్, ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్ ఆడనుండగా.. లిమిటెడ్ ఓవర్ల స్పెషలిస్టులతో కూడిన జట్టు లంక పర్యటనకు వెళ్లనుంది. ఇక, యంగ్ భారత్ కు రాహుల్ ద్రావిడ్ కోచ్ గా వ్యవహరించనున్నారు.
భారత జట్టు: శిఖర్ ధావన్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్(వైస్ కెప్టెన్), పృథ్వీ షా, దేవ్‌దత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, మనీష్ పాండే, హార్దిక్ పాండ్య, నితిష్ రాణా, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), సంజు శాంసన్(వికెట్ కీపర్),యజువేంద్ర చాహల్, రాహుల్ చాహర్, కె.గౌతమ్, కృనాల్ పాండ్య, కుల్‌దీప్ యాదవ్, వరణ్ చక్రవర్తి, దీపక్ చాహర్, నవ్‌దీప్ సైనీ, చేతన్ సకారియా
నెట్ బౌలర్స్: ఇషాన్ పోరెల్, సందీప్ వారియర్, అర్ష్‌దీప్ సింగ్, సాయి కిషోర్, సిమర్‌జీత్ సింగ్
కోచ్ : రాహుల్ ద్రావిడ్