కరోనా కష్టాలు, వరదల కన్నీళ్లు మిగిల్చి వెళ్లింది 2021. అలుపెరుగని పోరాటం నేర్పిన ఈ సంవత్సరం వీడ్కోలు తీసుకుంది. ఆశయాల సాధనకి అవకాశాలు మోసుకొస్తోన్న నూతన సంవత్సరం 2022కి శుభస్వాగతం పలుకుదాం. మీరు ఎన్నుకున్న రంగాలలో నవవసంతం విజయాలు అందించాలని
కోరుకుంటున్నాను. విద్యా, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాలలో ఉన్నతస్థానాలకు చేరాలని ఆకాంక్షిస్తున్నాను. తెలుగుప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
…నారా లోకేష్
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి